రోజ్ వ్యాలీ స్కాం.. బాధితులకు రూ.12 కోట్లు పంచనున్న ఈడీ

రోజ్ వ్యాలీ స్కామ్ బాధితుల సహాయార్థం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చర్యలు చేపట్టారు.

Update: 2024-08-05 07:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోజ్ వ్యాలీ స్కామ్ బాధితుల సహాయార్థం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చర్యలు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం కోల్‌కతాలోని రోజ్ వ్యాలీ గ్రూప్ ఆఫ్ కంపెనీల తమ కష్టమర్లు, అకౌంట్ దారులకు ఎక్కువ మొత్తంలో రాబడి వస్తుందని ఆశ చూపి.. భారీ మొత్తంలో డిపాజిట్లను ఆకర్షించి మోసం చేసింది. రోజ్ వ్యాలీ స్కామ్‌కు సంబంధించిన ఈ డిపాజిట్ల విలువ రూ. 11.99 కోట్లు, వాటిని కోర్టు పర్యవేక్షణలో ఉన్న అసెట్ డిస్పోజల్ కమిటీకి బదిలీ చేయాలని ఆదేశించింది. రోజ్ వ్యాలీ గ్రూప్ వివిధ రాష్ట్రాల్లో సుమారు 17,000 కోట్ల రూపాయల పెట్టుబడిదారులను మోసగించిందని ఆరోపణలు వచ్చాయి. కనీసం ఆరు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పెట్టుబడులను పెంచడం ద్వారా ఈ డబ్బు ప్రాథమికంగా సేకరించబడింది. ఈ కంపెనీ 11.2 శాతం నుంచి 17.65 శాతం వరకు వడ్డీ రేట్లతో ప్లాన్‌లను ఆఫర్ చేసినట్లు సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కనుగొంది.

Tags:    

Similar News