Paytm, Razorpay కార్యాలయాల్లో ఈడీ దాడులు..

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య ఇన్‌స్టాంట్ లోన్ యాప్స్‌కు బలవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇచ్చే మొత్తానికి అధిక వడ్డీలు వేయడమేకాకుండా..

Update: 2022-09-03 10:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని పేటీఎం, రేజర్‌పై కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. చైనా వాళ్ల చేత నడపబడే అనధికార ఇన్‌స్టాంట్ లోన్ యాప్స్ కేసులో ఈ సంస్థలకు సంబంధం ఉందనే అనుమానంతో ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే నిందుతులు తమ అక్రమ లావాదేవీలు చేసేందుకు వివిధ అకౌంట్లు, పేమెంట్ గేట్‌వేలను వినియోగిస్తున్నారని వారు తెలిపారు. అయితే ఈ మధ్య ఇన్‌స్టాంట్ లోన్ యాప్స్‌కు బలవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇచ్చే మొత్తానికి అధిక వడ్డీలు వేయడమేకాకుండా, బాధితులను అనేక రకాలుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా లోన్ తీసుకున్న వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని బాధితుల కుటుంబీకులు, స్నేహితులకు పంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో చైనా లోన్‌ యాప్స్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. లోన్ యాప్స్‌ను తమను దోచుకుంటున్నాయని, అత్యధిక వడ్డీలు డిమాండ్ చేస్తున్నాయని బాధితులు పేర్కొన్నారు. దాంతో ఈడీ ఈ లోన్ యాప్స్‌ స్కీంపై దృష్టి సారించింది. ఈ కేసులో సంబంధం ఉందని పించిన ప్రతి సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. ఇందులో భాగంగానే శనివారం పేటీఎం, రేజర్‌పే, క్యాష్ ఫ్రీ పేమెంట్ కార్యాలయాల్లో సోదాలు చేసింది.

Tags:    

Similar News