బూత్ స్థాయి సమస్యల పరిష్కారానికి ముందడుగు
జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల క్రియాశీల భాగస్వామ్యంతో ఇప్పటకిే ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయని ఈసీఐ తన ప్రకటనలో తెలిపింది.

- త్వరలో అఖిల పక్ష సమావేశాలుర్వహించనున్న ఎన్నికల సంఘం
- బూత్‌ల వారీగా ఎన్నికల శాతం వెల్లడిపై కూడా చర్చ
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశాలను ఈసీఐ ప్రారంభించింది. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల ఓటింగ్ శాతాన్ని తమ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయాలనే డిమాండ్‌పై చర్చ జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు ఈసీఐ తెలియజేసిన కొన్ని రోజుల తర్వాతే ఈ సమావేశాలు ప్రారంభం కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా 4,123 మంది ఈఆర్వోలు తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న పోలింగ్ బూత్ స్థాయి సమస్యల పరిస్కారానికి సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఈసీఐ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 788 జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవో), 36 మంది సీఈవోలు కూడా రాష్ట్ర స్థాయిలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రాతినిథ్యం చట్టం 1950, 1951.. ఓటర్ నమోదు నియమాలు 1960, ఎన్నికల నిర్వహణ నియమాలు 1961 మేరకు ఈ సమావేశాలు జరుగుతాయని చెప్పింది.
జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల క్రియాశీల భాగస్వామ్యంతో ఇప్పటకిే ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయని ఈసీఐ తన ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో చర్చలు పూర్తి కావడానికి మార్చి 31 వరకు గడువు విధించింది. అనేక రాజకీయ పార్టీలు ఓటు హక్కును వినియోగించే ప్రక్రియను బలోపేతం చేయాలని కోరుతున్నాయి. ముఖ్యంగా టీఎంసీ ఇటీవలే ఫొటో ఐడెంటిటీ కార్డ్ (ఎపిక్) నంబర్ల నకిలీ అంశంపై ఈసీఐకి ఇప్పటికే టార్గెట్ చేసింది. కాగా సమస్యను మూడునెలల్లో పరిష్కరిస్తామని ఈసీఐ తెలిపింది. ఓటర్, ఆధార్ కార్డు అనుసంధానంపై కూడా ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం త్వరలోనే ఈ అనుసంధాన కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పింది.