అస్సాంలో 3.6 తీవ్రతతో భూకంపం..

అస్సాం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 11:35 గంటలకు 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Update: 2023-06-11 10:31 GMT

తేజ్‌పూర్ (అస్సాం) : అస్సాం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 11:35 గంటలకు 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున సోనిత్‌పూర్ జిల్లాలో 5 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం ఖచ్చితమైన ప్రదేశం ఉత్తర మధ్య అస్సాంలోని తేజ్‌పూర్ పట్టణానికి సమీపంలో.. గౌహతికి ఈశాన్యంగా 150 కిమీ దూరంలో ఉందని తెలిపింది.

బ్రహ్మపుత్ర నదికి దక్షిణ ఒడ్డున ఉన్న మోరిగావ్, నాగావ్, వెస్ట్ కర్బీ అంగ్లాంగ్‌లతో పాటు పొరుగున ఉన్న దర్రాంగ్, లఖింపూర్, ఉదల్‌గురి జిల్లాల్లోని ప్రజలు కూడా భూప్రకంపనలను ఫీల్ అయ్యారు. ఈశాన్య రాష్ట్రాలు అధిక భూకంప జోన్‌లో ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి.


Similar News