BAKING: జమ్మూకశ్మీర్‌లో భూకంపం.. ఇళ్లలో నుంచి జనం పరుగులు
జమ్మూకశ్మీర్‌లోని నార్త్ భాగంలో భూకంపం సంభవించింది. ఇవాళ మధ్యాహ్నం కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో, లద్దాక్‌లోని లేహ్‌లో భయాందోళన వాతవరణం నెలకొంది.
దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని నార్త్ భాగంలో భూకంపం సంభవించింది. ఇవాళ మధ్యాహ్నం కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో, లద్దాక్‌లోని లేహ్‌లో భయాందోళన వాతవరణం నెలకొంది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం తీవ్రత నమోదు అయింది. ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో ఉన్న వారు వెంటనే బయటకు పరుగులు తీశారు. మరోవైపు మార్కెట్‌లో ఉన్న ప్రజలు, దుకాణదారులు ఒక్కసారి పరగులు తీసీ సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. మార్కెట్ ప్రదేశల్లో హడావుడి నెలకొంది.
ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు స్థానికులు కొందరు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.