ఒడిశా పర్యటనలో రాష్ట్రపతి ముర్ము..పూరీ జగన్నాధుడి రథయాత్రకు హాజరు

నాలుగు రోజుల ఒడిశా పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆ రాష్ట్రానికి చేరుకున్నారు. బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆమెకు గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝీలు ఘన స్వాగతం పలికారు.

Update: 2024-07-06 16:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నాలుగు రోజుల ఒడిశా పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆ రాష్ట్రానికి చేరుకున్నారు. బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆమెకు గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం1936లో ఒడిశా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిన ఒడియా ఐకాన్ ఉత్కలామణి పండిట్ గోపబంధు దాస్ 96వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం పూరీలో జరిగే జగన్నాధుడి రథయాత్రకు ముర్ము హాజరుకానున్నారు. ఆ తర్వాత ఉదయగిరి గుహలను సందర్శించి, బిభూతి కనుంగో కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఉత్కల్ యూనివర్శిటీ ఆఫ్ కల్చర్ విద్యార్థులతో సంభాషించనున్నారు. మరుసటి రోజు భువనేశ్వర్ సమీపంలోని హరిదామడ గ్రామంలో బ్రహ్మ కుమారీల డివైన్ రిట్రీట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. జూలై 9న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 13వ స్నాతకోత్సవంలో పాల్గొని అదే రోజు తిగిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.


Similar News