లాహువల్, స్పితి జిల్లాలో భారీ మంచు.. అస్తవ్యస్తమైన జనజీవనం

హిమాచల్ ప్రదేశ్‌లోని లాహువల్, స్పితి జిల్లాలో భారీగా కురుస్తున్న మంచు కారణంగా విద్యుత్, నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

Update: 2024-03-09 13:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లోని లాహువల్, స్పితి జిల్లాలో భారీగా కురుస్తున్న మంచు కారణంగా విద్యుత్, నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాగే కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ స్తంభించిపోయి జనజీవనం అస్తవ్యస్తం అయిందని అధికారులు శాటిలైట్ ఫోన్ ద్వారా తెలిపారు. మార్చి 2 నుంచి కురుస్తున్నటువంటి భారీ మంచు కారణంగా ఈ ప్రాంతంలో మూడు జాతీయ రహదారులతో పాటు అనేక చిన్న రహదారులను మూసివేశారు. దుకాణాలు కూడా పాక్షికంగా తెరుచుకుంటున్నాయి. విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన కమ్యూనికేషన్, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరుసగా కురుస్తున్నటువంటి మంచు కారణంగా లాహువల్, స్పితి జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు.


Similar News