గుజరాత్‌లో రూ.1,026 కోట్ల డ్రగ్స్ స్వాధీనం..

గాంధీనగర్: గుజరాత్‌లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పోలీసులు సీజ్ చేశారు.Latest Telugu News

Update: 2022-08-16 16:39 GMT

గాంధీనగర్: గుజరాత్‌లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పోలీసులు సీజ్ చేశారు. మంగళవారం గుజరాత్‌లో ఓ తయారీ సంస్థలో 500 కేజీల మెఫెడ్రోన్‌ను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1,026 కోట్లు ఉంటుందని వెల్లడించారు. పక్కా సమాచారం ఆధారంగా అంక్లేశ్వర్ పట్టణంలోని తయారీ సంస్థలో యాంటీ నార్కోటిక్స్ సెల్ దాడి చేసినట్లు తెలిపారు. దీంతో సంబంధమున్న గిరిరాజ్ దీక్షిత్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తితో కలిసి మెఫెడ్రోన్‌ను తయారు చేస్తున్నారని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ ఎత్తున పట్టుబడటం ఇదే తొలిసారని డీసీపీ దత్తా నలవాడే అన్నారు. ఇంతకుముందు రూ.2,435 కోట్ల విలువ చేసే 1,218 కేజీల డ్రగ్‌ను పోలీసుల స్వాధీనం చేసుకోగా, ఏడుగురిని అరెస్ట్ చేశారు.


Similar News