Kolkata Doctor Rape-Murder: కలకత్తా మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ల నిరసన

కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ లో ట్రైనీ డాక్టర్లు నిరసన కొనసాగిస్తున్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ని తమ కాలేజ్ కు బదిలీ చేయడంపై ఆందోళన చేపట్టారు.

Update: 2024-08-13 11:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ లో ట్రైనీ డాక్టర్లు నిరసన కొనసాగిస్తున్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ని తమ కాలేజ్ కు బదిలీ చేయడంపై ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ తట్టుకోలేనని ఆర్జీ కర్ కాలేజ్ కు రాజీనామా చేసిన కొన్నగంటలకే.. మరో కీలక మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా డాక్టర్ సందీప్ నియమితులయ్యారు. కాగా.. కలకత్తా మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్లు దీనికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. కోల్ కతా మెడికో అత్యాచారం-హత్య కేసులో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ సంజయ్ ని ప్రిన్సిపల్ గా నియమిస్తూ సోమవారం అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్ సంజయ్ ని ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టబోమని చెప్పారు.

టీఎంసీ నేతలను అడ్డుకున్న మెడికోలు

పశ్చిమ బెంగాల్ మంత్రి జావేద్ అహ్మద్ ఖాన్, టీఎంసీ ఎమ్మెల్యే స్వర్ణ కమల్ విద్యార్థులతో మాట్లాడేందుకు కలకత్తా మెడికల్ కాలేజ్ క్యాంపస్‌ను సందర్శించారు. తమ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ సంజయ్ ను నియమించడం అత్యంత అనైతికమని నిరసనకారులు ఆరోపించారు. "గో బ్యాక్" అంటూ ట్రైనీ డాక్టర్లు నినాదాలు చేశారు. టీఎంసీ నేతలు క్యాంపస్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో టీఎంసీ నేతలు వెనక్కి వెళ్లిపోయారు. తమ క్యాంపస్‌లో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి చెందిన "చెత్త" తమకు వద్దు అని మండిపడ్డారు. వైద్య విద్యార్థులు మాట్లాడుతూ "మేం మా క్యాంపస్‌ను ఆర్జీ కర్ గా మార్చనివ్వం. ఆందోళన 24 గంటలు కొనసాగుతోంది. ప్రిన్సిపాల్ కార్యాలయం తలుపుల వద్ద క్యాంప్ చేస్తాం. సందీప్ ఘోష్‌ని ఇక్కడికి పంపితే.. ఈ క్యాంపస్ భద్రతతో కూడా రాజీపడినట్లే" అని అన్నారు.

డాక్టర్ సందీప్ ఘోష్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

మరోవైపు, డాక్టర్ సంజయ్ ఘోష్ విషయంలో కలకత్తా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ‘‘ఏ మనిషి చట్టానికి అతీతుడు కాదు. అతను రాజీనామా చేసిన వెంటనే మరో బాధ్యతను ఎలా స్వీకరించారు?’’ అని కోర్టు ప్రశ్నించిందిం. " మీరు అతన్ని ఎందుకు రక్షిస్తున్నారు? అతడితో నిజం చెప్పించండి. ఇక్కడ ఏదో మిస్ అయింది" అని వైద్యవిద్యార్థిని హత్య కేసుకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది. "అక్కడ పనిచేస్తున్న వైద్యులందరికీ ప్రిన్సిపాల్ సంరక్షకుడు. అతను సానుభూతి చూపకపోతే ఎవరు చూపిస్తారు? అతను ఎక్కడా పని చేయకుండా ఇంట్లో ఉండాలి" అని కలకత్తా హైకోర్టు సీజేఐ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం ఆశ్చర్యపోయింది. మాజీ ప్రిన్సిపాల్ కోసం ప్రభుత్వ న్యాయవాది ఎందుకు వాదనలు వినిపించారని పేర్కొంది. నైతిక బాధ్యత వహించి ప్రిన్సిపాల్ పదవీ విరమణ చేస్తే.. అతనికి 12 గంటలలోపు మరో అపాయింట్‌మెంట్ ఇవ్వడం చాలా తీవ్రమైన విషయం. అతన్ని లాంగ్ లీవ్‌పై వెళ్లనివ్వండి. లేకుంటే మేం ఆదేశాలు జారీ చేస్తాం" అని కోర్టు పేర్కొంది.


Similar News