Donald Trump: త్వరలోనే ప్రధాని మోడీతో భేటీ అవుతా
ప్రధాని నరేంద్ర మోడీతో(PM Modi) భేటీ అవుతానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీతో(PM Modi) భేటీ అవుతానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వచ్చేవారం మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. మిచిగాన్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ట్రంప్(Donald Trump) మాట్లాడుతూ.. మోడీపై ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన వ్యక్తి అంటూ కొనియాడారు. అయితే, మోడీతో భేటీకి సంబంధిచిన పూర్తి వివరాలను మాత్రం ఆయన తెలియజేయలేదు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్.. ప్రధాని మోడీతో సమావేశం అవుతానని ప్రకటించటంపై తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
మోడీ పర్యటన
ఇక, సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షతను జరగనున్న నాలుగో క్వాడ్ సమ్మిట్‌లో ఆయన పాల్గొననున్నారు. సెప్టెంబర్ 21న న్యూయార్క్‌లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు. సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’’లో కూడా ప్రధాని ప్రసంగించబోతున్నారు. ఇక, 2020 ఫిబ్రవరిలో భారతదేశాన్ని సందర్శించిన టైంలో డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోడీతో చివరిసారి కలిశారు.