విధి ఆడిన వింత నాటకం.. 16000 మందిని కాపాడి తన ప్రాణం నిలుపుకోలేకపోయిన డాక్టర్
ఈ మధ్య కాలంలో గుండె పోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో గుండె పోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండె పోటుకు గురై మృత్యువాత పడుతున్నారు. సామాన్యులకు ఇది వస్తుంది అనుకుంటే అది మన పొరపాటే. ఎందుకంటే.. 16000 గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ సైతం అదే గుండె పోటుకు మరణించారు. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ జామ్ నగర్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ (41) అనే వ్యక్తి అతని సర్వీస్‌లో దాదాపుగా ఇప్పటివరకూ 16,000 మందికి గుండె సంబంధిత ఆపరేషన్లు చేశారు. అంతే కాకుండా గుండెపోట్లు సంఖ్యను తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించేవారు. అలాంటి ఆయన అనుష్య రీతిలో నిన్న ఉదయం గుండెపోటుతో మరణించారు. కాగా.. గుండెపోటుతో ఆయన మరణించడం నెట్టింట చర్చనియాంశంగా మారింది.