మాజీ జడ్జి పేరు ముందు "రిటైర్డ్" రాయొద్దు.. అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం

పదవీవిరమణ పొందిన న్యాయమూర్తి పేర్ల ప్రస్థావన అంశంలో అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-26 09:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పదవీవిరమణ పొందిన న్యాయమూర్తి పేర్ల ప్రస్థావన అంశంలో అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ తీసుకున్న జడ్జిల పేర్ల ముందు 'రిటైర్' అని రాయవద్దని స్పష్టం చేసింది. ఓ కేసు విషయంలో ప్రభుత్వ అధికారి హైకోర్టు జడ్జి పేరు తప్పుగా రాయడాన్ని ప్రస్తావిస్తూ.. రిటైర్డ్ అనే పదాన్ని జడ్జి పేరు లాగా చేర్చే విధానానికి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. న్యాయమూర్తి పేరు రాసిన తర్వాత "రిటైర్డ్ జడ్డి", "హైకోర్టు రిటైర్ట్ జడ్జి" అని పేర్కొనవచ్చని జస్టిస్ జేజే మునీర్ చెప్పారు. లవ్ కుష్ తివారీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారి అఫిడవిట్ సమర్పించారు.

ఇందులో మాజీ న్యాయమూర్తి పేరును తప్పుగా రాశారని చెబుతూ.. రిటైర్డ్ జడ్జిని "గౌరవనీయ మిస్టర్ జస్టిస్.. (రిటైర్డ్)" అని సూచించకూడదని, రిటైర్డ్ అనే పదాన్ని న్యాయమూర్తి పేరులో ఉన్నట్లుగా జోడించకూడదని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా "మిస్టర్ జస్టిస్" అనే బిరుదును కలిగి ఉంటారని, రిటైర్డ్ జడ్జి విషయంలో.. అతని పేరు "మిస్టర్ జస్టిస్.. " అని సూచించిన తర్వాత, "రిటైర్డ్ జడ్జి" లేదా "రిటైర్డ్ జడ్జి ఆఫ్ హైకోర్ట్" అనే పదాలు పేర్కొనవచ్చని చెప్పారు. "మిస్టర్ జస్టిస్" పేరు తర్వాత "రిటైర్డ్" అనే పదం రావాలనేది ప్రత్యయం కాదని, ఇది పూర్తిగా అవాస్తవం, దీనిని ప్రభుత్వం గమనించాలని కోర్టు స్పష్టం చేసింది.


Similar News