అవినీతి పరులందరినీ డీఎంకే సభ్యత్వం ఇచ్చి పార్టీలో చేర్చుకుంది: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

తమిళనాడులోని కోయంబత్తూరు లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఇషా ఫౌండేషన్‌లో జరిగే మహాశివరాత్రి వేడుకలకు హాజరయ్యేందు అమిత్ షా మంగళవారం రాత్రి అక్కడకు చేరుకున్నారు.

Update: 2025-02-26 08:19 GMT
అవినీతి పరులందరినీ డీఎంకే సభ్యత్వం ఇచ్చి పార్టీలో చేర్చుకుంది: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని కోయంబత్తూరు లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) పర్యటిస్తున్నారు. ఇషా ఫౌండేషన్‌ (Isha Foundation)లో జరిగే మహాశివరాత్రి వేడుకల (Mahashivratri celebrations)కు హాజరయ్యేందు అమిత్ షా మంగళవారం రాత్రి అక్కడకు చేరుకున్నారు. తమిళనాడులో హిందీ భాషను విధించడం.. విద్యా నిధుల విడుదలకు నిరాకరించడం, రాష్ట్రంలో వివాదాస్పద త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని లక్ష్యంగా చేసుకుని నిరసన తెలిపేందుకు స్థానిక రాజకీయ నేతలు సిద్ధం అయిన నేపథ్యంలో కోయంబత్తూర్ వ్యాప్తంగా హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. డీఎమ్ కే ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు సమాజంలోని అవినీతి పరులందరు డీఎంకే సభ్యత్వం తీసుకుని డీఎంకే (DMK)లో చేరిపోయినట్లు కొన్నిసార్లు అనిపిస్తుందని అన్నారు. అలాగే సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ప్రజల సమస్యల నుంచి తప్పుకునేందుకు అనేక అంశాలు లేవనెత్తుతున్నారని అన్నారు. ఈరోజు డీలిమిటేషన్‌కు సంబంధించి సమావేశం కానున్నారని, డీలిమిటేషన్ తర్వాత కూడా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గవని ప్రధాని మోదీ స్పష్టం చేశారని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేశారు. కాగా గత కొద్ది రోజులగా.. దేశంలో డీలిమిటేషన్ (Delimitation) జరిగితే.. సౌత్ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని.. కేవలం నార్త్ రాష్ట్రల్లో పెరిగే సీట్లతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందని.. అలా జరిగితే సౌత్ రాష్ట్రాలు అయిన కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తీవ్రంగా నష్టపోతాయనే వాదనను పార్టీ వినిపిస్తున్న క్రమంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah)  క్లారిటీ ఇచ్చారు.

Similar News