J&K: బారాముల్లాలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం.. ఇద్దరు హతం

బుధవారం మధ్యాహ్నం సమయంలో దళాలు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న గుర్తుతెలియని వ్యక్తుల కదలికలను గుర్తించాయి.

Update: 2025-04-23 16:00 GMT
J&K: బారాముల్లాలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం.. ఇద్దరు హతం
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బుధవారం నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేసే క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పెహల్‌గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దారుణం జరిగిన 24 గంటల తర్వాత చొరబాటు ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం సమయంలో అలర్ట్ అయిన దళాలు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న గుర్తుతెలియని వ్యక్తుల కదలికలను గుర్తించాయి. కాసేపటికి అటునుంచి కవ్వింపు చర్యలు కనిపించడంతో భారీ కాల్పులు జరిగాయి అని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొంది. ఉత్తర కశ్మీర్ జిల్లాలోని ఉరి సెక్టార్‌లో ఈ చొరబాటు ప్రయత్నం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి రెండు ఏకే రైఫిళ్లు, ఒక చైనీస్ పిస్టల్, 10 కిలోల ఐఈడీ సహా ఇతర యుద్ధ తరహా వస్త్వులను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. 

Tags:    

Similar News