Dilhi aqi: ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత.. ఆనంద విహార్‌లో 454కు చేరిన ఏక్యూఐ

దేశ రాజధానిలో గాలి నాణ్యత రోజు రోజుకూ క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) దారుణంగా పడిపోతుంది.

Update: 2024-10-20 06:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో గాలి నాణ్యత రోజు రోజుకూ క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) దారుణంగా పడిపోతుంది. ఆదివారం ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్‌లో ఏక్యూఐ 265గా నమోదైనట్టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. ఇతర ప్రదేశాల్లో పట్‌పర్‌గంజ్ 294, నెహ్రూ నగర్ 258, ఆర్ కే పురం 251ఏక్యూఐగా నమోదైంది. వివేక్ విహార్ 302, షాదీపూర్‌లో ఏక్యూఐ 322గా ఉండగా..ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ ఏకంగా 454కు పడిపోయింది. ఇది తీవ్రమైన కేటగిరీలోకి వస్తుందని అధికారులు తెలిపారు. అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 23.05 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనట్టు ఐఎండీ వెల్లడించింది.

యూపీ బస్సులే కారణం: ఢిల్లీ ప్రభుత్వం

ఆనందవిహార్ ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణించడంపై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. ఇక్కడ ఏక్యూఐ క్షీణించడానికి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే బస్సులే కారణమని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అతిశీ, పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆదివారం ఆనంద్ విహర్‌లో పర్యటించారు. స్థానికులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు పకడ్బంధీగా చేపట్టినట్టు తెలిపారు. దుమ్ము, దూళిని అరికట్టడానికి బృందాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా 99 టీమ్ లను ఏర్పాటు చేశారు. యూపీ నుంచి వచ్చే బస్సుల వల్లే కాలుష్యం పెరుగుతోందని ఆ ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉందని సీఎం అతిశీ తెలిపారు. హర్యానా, యూపీలు శుద్ది చేయని వ్యర్థాలను విడుదల చేస్తున్నాయని ఆరోపించారు. 


Similar News