తిరిగి ఇంటికి ప్రాణాలతో వెళ్తామో లేదో చెప్పలేము.. చార్ ధామ్ యాత్ర భక్తులు

నిన్న కేదారీనాథ్ ఆలయ తలుపలు తెరుచుకున్నాయి.

Update: 2024-05-11 09:47 GMT

దిశ వెబ్ డెస్క్: నిన్న కేదారీనాథ్ ఆలయ తలుపలు తెరుచుకున్నాయి. దీనితో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ చార్ ధామ్ యాత్రలో భాగంగా నేడు యుమునోత్రికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. అయితే కొండల్లో ఉన్న యుమునోత్రిని చేరుకునే మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది. కాగా మార్గం చిన్నది కావడం, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ రద్దీ ఏర్పడింది.

దీనితో నిన్న యుమునోత్రి తలుపలు తెరిచినప్పటి నుండి చాలామంది భక్తులు క్యూల్లోనే గడుపుతూ, స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది భక్తులు మాట్లాడుతూ.. ఇరుకుగా, ప్రమాధాలు జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉన్న క్యూల్లో గంటల తరబడి గడుపుతున్నా, అధికారులు భక్తుల భద్రత గురించి పట్టించుకోవడం లేదని తెలిపారు.

తాము క్యూల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, అయినా అధికారులు ఎవరూ తమకి సహాయం చెయ్యడం లేదని పేర్కొన్నారు. అలానే ఓ మహిళ మాట్లాడుతూ.. తాము ఆలయంలోకి అయితే వచ్చామని, కానీ తిరిగి ఇంటికి ప్రాణాలతో వెళ్తామో లేదో చెప్పలేము అని అన్నారు.  కాగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు చార్ ధామ్ యాత్రకు నమోదు చేసుకున్నారు. 


Similar News