Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఫడ్నవీస్
Devendra Fadnavis To be Sworn in as chief minister of Maharashtra| మహారాష్ట్ర రాజకీయాలు క్షణ క్షణం మారిపోతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత, బీజేపీ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం, జూలై 1న సీఎంగా ప్రమాణ స్వీకారం
దిశ, వెబ్‌డెస్క్ : Devendra Fadnavis To be Sworn in as chief minister of Maharashtra| మహారాష్ట్ర రాజకీయాలు క్షణ క్షణం మారిపోతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత, బీజేపీ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం, జూలై 1న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శివసేన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్ డిప్యూటీగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో మహాలో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, షిండే వర్గం మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యింది. సీఎం ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది.
అనంతరం షిండే వర్గాన్ని శివసేన శాసనసభా పక్షంగా గుర్తించే అవకాశం ఉంది. తదుపరి దవ అసెంబ్లీలో తమ విప్‌ను ఎన్నుకోనున్నారు. తర్వాత వారికి విశ్వాస తీర్మానం పెట్టేందుకు గవర్నర్ సమయం ఇవ్వనున్నారు. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. జూలై 11 నాటికి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది.