Dera Baba: డేరా బాబాకు మరోసారి పెరోల్..!

డేరా చీఫ్‌(Dera chief) గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ (Gurmeet Ram Rahim Singh) అలియాస్‌ డేరా బాబా (Dera Baba) మరోసారి పెరోల్‌(Parole)పై జైలు నుంచి విడుదలవుతున్నారు.

Update: 2024-10-01 12:23 GMT

దిశ, వెబ్‌డెస్క్:డేరా చీఫ్‌(Dera chief) గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ (Gurmeet Ram Rahim Singh) అలియాస్‌ డేరా బాబా (Dera Baba) మరోసారి పెరోల్‌(Parole)పై జైలు నుంచి విడుదలవుతున్నారు. ఇద్దరు మహిళలపై లైంగికదాడిsexual assaultకి పాల్పడిన కేసులో అతనికి కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష(Imprisonment) విధించింది.ప్రస్తుతం అతడు హర్యానా(Haryana)లోని రోహ్‌తక్‌ జైలు(Rohtak Jail)లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే వివిధ కారణాలతో గత తొమ్మిది నెలల్లో ఆయనకు రెండు సార్లు పెరోల్‌ లభించగా తాజాగా మరోసారి అతనికి పెరోల్ లభించింది.కాగా మరో నాలుగు రోజుల్లో హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబా పెట్టుకున్న పెరోల్‌ పిటిషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఆమోదించింది.అతని పెరోల్‌కు EC అనుమతివ్వడంతో హర్యానా ప్రభుత్వం ఆయన విడుదలకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.కాగా అతని పెరోల్ రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ(Congress party) విజ్ఞప్తి చేసింది.


Similar News