వరదసాయం విడుదల చేసిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు ఎన్ని కోట్లు కేటాయించిందంటే?
వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్లను మంగళవారం విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్లను మంగళవారం విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1036 కోట్లు విడుదల చేయగా.. తెలంగాణకు రూ.416.80 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తునిధికి ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్ర వాటా రిలీజ్ చేసింది. ఈ నిధుల్లో అత్యధికంగా మహరాష్ట్రకు రూ.1432 కోట్లు విడుదల చేసింది. కేంద్ర బృందాలు పర్యటించి ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా అడ్వాన్స్‌గా నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోమ్ శాఖ ప్రకటన చేసింది. కాగా, నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు కొండచరియలు విరిగిపడటం వల్ల 14 రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
మహరాష్ట్ర: రూ. రూ.1432 కోట్లు
ఆంధ్రప్రదేశ్: రూ.1036 కోట్లు
తెలంగాణ: రూ.రూ.416.80 కోట్లు
అస్సాం: రూ.716 కోట్లు
బిహార్: రూ.655.60 కోట్లు
గుజరాత్: రూ.600 కోట్లు
హిమాచల్ ప్రదేశ్: రూ.189.20 కోట్లు
కేరళ: రూ.145.60 కోట్లు
మణిపూర్: రూ.50 కోట్లు
మిజోరాం: రూ.21.60 కోట్లు
నాగాలాండ్: రూ.19.20 కోట్లు
సిక్కిం: రూ.23.60 కోట్లు
త్రిపుర: రూ.25 కోట్లు
వెస్ట్ బెంగాల్: రూ.468 కోట్లు