కేజ్రీవాల్‌కి మళ్లీ షాకిచ్చిన కోర్టు.. అప్పటివరకు కస్టడీలోనే..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బుధవారం విచారణ జరిపిన రౌజ్ అవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్‌ కస్టడీని పొడిగించింది.

Update: 2024-09-11 14:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Delhi CM Aravind Kejriwal)కు మరో షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case)లో బుధవారం విచారణ జరిపిన రౌజ్ అవెన్యూ కోర్టు (Rauz Avenue Court) ఆయన జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody)ని సెప్టెంబర్ 25 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తీహార్ జైలు (Tihar Jail) నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మిగిలిన వారిని విచారించిన కోర్టు.. కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అయితే మరో నిందితుడు, ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admy Party) నేత దుర్గేష్ పాఠక్‌ (Durgesh Pathak)కు లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్ (Bail) మంజూరు చేసింది.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi Excise Policy)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Money Laundaring)లో ఈ ఏడాది మార్చి 21న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ (Enforcement Directorate) అరెస్టు చేసింది. ఆ తర్వాత ఇదే పాలసీలో కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారంటూ సీబీఐ (Central Bureau of Investigation) కూడా జూలైలో మరో కేసు నమోదు చేసింది. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచారం (Election Campaing) కోసం మే 10న ఆయనకు సుప్రీం కోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల అనంతరం జూన్‌లో తిరిగి జైలుకు వెళ్లిపోయారు. ఇక అదే నెలలో జూన్ 26న సీబీఐ కూడా ఆయనను అవినీతి కేసులో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. అయితే ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు జూలై 12న బెయిల్ మంజూరైనా సీబీఐ కేసులో మాత్రం ఆయనకు బెయిల్ దొరకడం లేదు. ఆగస్టు 27, సెప్టెంబర్ 3.. ఇప్పుడు సెప్టెంబర్ 11... ఇలా ప్రతి సారీ ఆయన జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తూనే ఉంది.


Similar News