ఢిల్లీ ఆరోగ్య మంత్రి ఓఎస్డీని సస్పెండ్ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్
ఢిల్లీ ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ ఓఎస్డీ డాక్టర్ ఆర్ఎన్ దాస్ సస్పెండ్ అయ్యారు. డాక్టర్ ఆర్ఎన్ దాస్ ని సస్పెండ్ చేసినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ ఓఎస్డీ డాక్టర్ ఆర్ఎన్ దాస్ సస్పెండ్ అయ్యారు. డాక్టర్ ఆర్ఎన్ దాస్ ని సస్పెండ్ చేసినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ నర్సింగ్‌హోంల అక్రమ రిజిస్ట్రేషన్ లో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఆర్ఎస్ దాస్ ఎదుర్కొంటున్నారు. శనివారంత రాత్రి ఢిల్లీలోని బేబీ కేర్ ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో ఆరుగురు చిన్నారుడు చనిపోయారు. దీంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎల్జీ తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించి డాక్టర్ ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. తక్షణమే ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని తెలిపారు.
2021లో కరోనా టైంలో దాదాపు రూ. 60 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, గ్లోవ్స్, మాస్కులు, ఆర్టీఏ కిట్ల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈకేసులో దాస్ కు ఏప్రిల్ లో విజిలెన్స్ డైరెక్టరేట్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. మరోవైపు, ఆరుగురు చిన్నారులు చనిపోయిన పిల్లల ఆస్పత్రి రిజిస్ట్రేషన్ లోనూ అవకతవకలు జరిగాయని బీజేపీ ఆరోపించింది. ఇందులో డాక్టర్ దాస్ పాత్ర ఉందని విమర్శించింది.