Amit Shah : అమిత్‌షాపై కెనడా ఆరోపణలు.. అమెరికా రియాక్షన్ ఇదీ

దిశ, నేషనల్ బ్యూరో : తమ దేశంలో ఖలిస్తానీల హత్యలు చేసేలా భారత ఏజెంట్లకు హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) ఆదేశాలు ఇచ్చారని ఇటీవలే కెనడా(Canada) ఉప విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-10-31 05:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తమ దేశంలో ఖలిస్తానీల హత్యలు చేసేలా భారత ఏజెంట్లకు హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) ఆదేశాలు ఇచ్చారని ఇటీవలే కెనడా(Canada) ఉప విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా(US) స్పందించింది. ఈ ఆరోపణలను ఆందోళన రేకెత్తించే అంశంగా అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ అభివర్ణించారు.

దీనిపై తాము కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. కాగా, కెనడా జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్ కూడా అమిత్‌షా‌పై ఆరోపణలు చేశారు. షా ఆదేశాల వల్లే కెనడాలో ఖలిస్తానీల హత్యలు జరిగాయని ఇటీవలే వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News