బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును జూలై 12న రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

జూలై 12(శుక్రవారం)కి తీర్పు ఇవ్వనున్నట్టు పేర్కొంది.

Update: 2024-07-10 14:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ పీఏ బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. జూలై 12(శుక్రవారం)కి తీర్పు ఇవ్వనున్నట్టు పేర్కొంది. కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూలై 16 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మే 13న ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు మేరకు మే 18న ఆయనను అరెస్ట్ చేశారు. బిభవ్ కుమార్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం వెళ్లినప్పటికీ తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసినట్టు బిభవ్ కుమార్ హైకోర్టుకు తెలియజేశారు. దీనిపై తాజాగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.


Similar News