Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ అధినేతకు డబుల్ షాక్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు డబుల్ షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ ది అక్రమ అరెస్టు కాదని సీబీఐకి వత్తాసు పలికింది.

Update: 2024-08-05 10:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు డబుల్ షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ ది అక్రమ అరెస్టు కాదని సీబీఐకి వత్తాసు పలికింది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఎలాంటి న్యాయపరమైన కారణం లేకుండా కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేసిందని చెప్పలేమని వ్యాఖ్యానించింది. సీబీఐ చర్యను చట్టవిరుద్ధంగా పేర్కొనలేమని కోర్టు పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టుని చట్టవిరుద్ధమని చెప్పలేమంది. సీబీఐ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ ను కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈవిషయంలో ట్రయల్ కోర్టుని ఆశ్రయించవచ్చని సూచించింది.

సుప్రీం కోర్టుని ఆశ్రయించిన కేజ్రీవాల్

సీబీఐ అరెస్ట్ చేసి తనని రిమాండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. రెగ్యులర్ బెయిల్ కూడా కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. రెండింట్లోనూ ఆయనకు ఎదురుదెబ్బే తగలింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులకు సంబంధించి ఈడి మనీలాండరింగ్ కేసులో బెయిల్ పొందిన వెంటనే సీబీఐ కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. ఆ తర్వాత అతని బెయిల్ ఆర్డర్‌ను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో, సుప్రీం కోర్టుని కేజ్రీవాల్ ఆశ్రయించగా.. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ తీర్పు వెలువరించింది.


Similar News