ఢిల్లీ సీఎంకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు చొప్పున ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ యత్నిస్తోందని ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కేజ్రీవాల్‌కు తాజాగా శుక్రవారం నోటీసులు అందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నుంచి ఐదుసార్లు సమన్లు అందినా.. అవి అక్రమమైనవి అంటూ కేజ్రీవాల్ దాటవేశారు. విచారణకు హాజరుకాలేదు. ఈనేపథ్యంలో ఇటీవల బీజేపీ టార్గెట్‌గా ఆయన చేసిన ఆరోపణల ఆధారంగానూ ఢిల్లీ పోలీసులు కేసును నమోదు చేయడం గమనార్హం. కాగా, ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం శాఖ పరిధిలోకి వస్తారు.