ఆ ఆర్డినెన్స్ వీగిపోవడం ఖాయం.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీప్రభుత్వ ఉద్యోగుల నియామకం, బదిలీలపై అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీప్రభుత్వ ఉద్యోగుల నియామకం, బదిలీలపై అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఫైర్ అయ్యారు. లోక్ సభలో ఆ ఆర్డినెన్స్ కు ఆమోదం లభించినా రాజ్యసభలో మాత్రం ఆమోదం లభించదని అన్నారు. రాజ్యసభలో ప్రతిపక్షాల సభ్యులు ఎక్కువ ఉన్నారని, ప్రతిపక్షాలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తే ఆ ఆర్డినెన్స్ వీగిపోవడం ఖాయమని కేజ్రీవాల్ అన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ కు ఆమోదం పలికే అవకాశం ఉందని, అయితే ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉంటే ఆ బిల్లును అడ్డుకోవచ్చని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ తమ ప్రభుత్వానికే కాదని మొత్తం ఫెడరల్ స్పూర్తికే విరుద్ధమని ఆప్ చీఫ్ తెలిపారు. ఈ ఆర్డినెన్స్ విషయంలో విపక్షాలు తమతో కలిసి రావాలని కేజ్రీవాల్ కోరారు.
Also Read..
బీజేపీ తీరుతో ప్రమాదకర స్థితిలో భారత్: కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ ఫైర్