నేనే అవినీతిపరుడైతే ఈ లోకంలో మంచివాళ్లెవరూ ఉండరు.. వీడియో రిలీజ్ చేసిన కేజ్రీవాల్
సీబీఐ విచారణకు వెళ్లే ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వీడియో రిలీజ్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసులో కాసేపట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘నన్ను అవినీతి పరుడంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో కమిషనర్ గా పని చేశాను. కావాలనుకుంటే కోట్ల కొద్దీ డబ్బు సంపాదించేవాడిని. కానీ నేను ఏనాడూ అలా చేయలేదు. కేజ్రీవాలే అవినీతి పరుడైతే ఈ ప్రపంచంలో మంచివారంటూ ఎవరూ ఉండరు’’ అని ఆయన అన్నారు.
సీబీఐ తనను విచారణకు పిలిచిందని, తాను కచ్చితంగా ఆ విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చాలా శక్తివంతమైనదని, ఎవరినైనా జైలుకు పంపగలదని అన్నారు. ఒకవేళ తనను అరెస్ట్ చేయాలని బీజేపీ ప్రభుత్వం ఆదేశిస్తే సీబీఐ చేయకతప్పదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదిలేదని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.
अब आप जो मर्ज़ी कर लीजिए। अब आप रोक नहीं पायेंगे। अब भारत दुनिया का नंबर वन देश बन के रहेगा। pic.twitter.com/xLBloVKg7o
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 16, 2023