కథువా ఉగ్రదాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రక్షణమంత్రి

జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిపై రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్ముకశ్మర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని.. శాంతి భద్రతలు నెలకొల్పేందుకు జవాన్లు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Update: 2024-07-09 07:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిపై రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్ముకశ్మర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని.. శాంతి భద్రతలు నెలకొల్పేందుకు జవాన్లు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. “కథువాలోని బద్నోటాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందినందుకు చింతిస్తున్నా” అని సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో దేశం వారికి అండగా నిలుస్తోందని అన్నారు. ఈ భయంకరమైన ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని వెల్లడించారు. ఇకపోతే, సోమవారం కథువాలోని బద్నోటాలో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఆ ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందగా.. పలువురు గాయపడ్డారు.


Similar News