Death: 24 మంది దళితుల హత్య కేసులో ముగ్గురికి ఉరిశిక్ష.. 44 ఏళ్ల తర్వాత తీర్పు

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌ జిల్లా దిహులి గ్రామంలో 1981లో జరిగిన 24 మంది దళితుల హత్య కేసులో ముగ్గురు దోషులకు ఉరిశిక్ష పడింది.

Update: 2025-03-18 13:10 GMT
Death: 24 మంది దళితుల హత్య కేసులో ముగ్గురికి ఉరిశిక్ష.. 44 ఏళ్ల తర్వాత తీర్పు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌ జిల్లా దిహులి (Dihuli) గ్రామంలో 1981లో జరిగిన 24 మంది దళితుల హత్య కేసులో ముగ్గురు దోషులకు యూపీలోని మెయిన్‌పురి స్పెషల్ కోర్టు (Special court) ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు 44 ఏళ్ల తర్వాత తీర్పు వెల్లడించింది. అంతేగాక ఒక్కొక్కరికి రూ. 50, 000 జరిమానా సైతం విధించింది. అంతకుముందు మార్చి 12న కోర్టు ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి ఇందిరా సింగ్ మంగళవారం తీర్పు వెల్లడించారు. మరణశిక్ష పడిన వారిలో కప్తాన్ సింగ్, రాంపాల్, రామ్ సేవక్‌లు ఉన్నారు. ఈ ఊచకోతను కోర్టు అత్యంత దారుణంగా పరిగణించింది. కాగా, 1981 నవంబర్ 18న సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఖాకీ దుస్తులు ధరించిన 17 మందితో కూడిన గుంపు దిహులి గ్రామంపై దాడి చేసింది. అనంతరం ఒక దళిత కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టింది. ఈ క్రమంలోనే 24 మందిని హత్య చేశారు. అందులో పిల్లలు మహిళలు సైతం ఉన్నారు. ఓ కేసులో తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా వీరిలో 13 మంది విచారణ దశలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించారు. అప్పటి నుంచి కేసు విచారణలో ఉండగా తాజాగా తీర్పు వెలువడడం గమనార్హం. సామూహిక హత్యాకాండ నేపథ్యంలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయి. ఈ క్రమంలోనే ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi), హోంమంత్రి బీపీ సింగ్ (Bp singh), ముఖ్యమంత్రి నారాయణ్ దత్ తివారీ, ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయిలు దిహులి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు.

Tags:    

Similar News