‘సీఎస్ఐఆర్ - యూజీసీ’ నెట్ పరీక్ష వాయిదా

దిశ, నేషనల్ బ్యూరో: ‘సీఎస్ఐఆర్ - యూజీసీ’ నెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.

Update: 2024-06-21 18:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ‘సీఎస్ఐఆర్ - యూజీసీ’ నెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. జూన్ 25 నుంచి 27 వరకు జరగాల్సి ఉన్న ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల పరీక్షను వాయిదా వేయక తప్పడం లేదని ఎన్‌టీఏ తెలిపింది. పరీక్షను మళ్లీ నిర్వహించే తేదీలను త్వరలోనే సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ వేదికగా ప్రకటిస్తామని చెప్పింది. ఈ అంశంపై సందేహాలున్న విద్యార్థులు హెల్ప్ లైన్ నంబర్లు 011- 40759000, 011-69227700 లేదా csirnet@nta.ac.in అనే మెయిల్ ఐడీ ద్వారా తమను సంప్రదించాలని ఎన్‌టీఏ కోరింది. ఈనెల 18న జరిగిన యూజీసీ నెట్ పరీక్షను.. మరుసటి రోజే రద్దు చేసిన సంగతి తెలిసిందే. నెట్ పరీక్ష ప్రశ్నపత్రం జూన్ 16నే లీకైందని సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలినందున.. తదుపరిగా షెడ్యూల్ చేసిన నెట్ పరీక్షలను కూడా ఎన్‌టీఏ వాయిదావేసింది. కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, లెక్చర్ షిప్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం అర్హతను నిర్ణయించేందుకు సీఎస్ఐఆర్ - యూజీసీ నెట్ పరీక్షను నిర్వహిస్తారు.


Similar News