అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్లను కొట్టివేసిన కోర్టు

ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు

Update: 2024-09-17 15:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఫిర్యాదులపై తనకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన రెండు పిటిషన్‌లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం కొట్టివేసింది. అంతకుముందు ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి కేజ్రీవాల్‌కు ఈడీ పలు సమన్లను పంపగా, వాటిని ఆయన దాటవేయడంతో దర్యాప్తు సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా కేజ్రీవాల్‌కు సమన్లు ​జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయమూర్తి రాకేశ్ సియాల్ కొట్టివేస్తూ, ఆయనపై విచారణకు తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.


Similar News