Gujarat , హిమాచల్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే!
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ బందోబస్తు మధ్య గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ను అధికారులు మొదలుపెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ బందోబస్తు మధ్య గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ను అధికారులు మొదలుపెట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. గుజరాత్‌లో 182, హిమాచల్‌ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికారం కోసం గుజరాత్‌లో 92 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లో 35 స్థానాలు గెలుచుకోవాలి. బీజేపీకి కంచుకోట లాంటి గుజరాత్‌లో వరుసగా ఏడోసారీ గెలిచి చరిత్ర సృష్టిస్తారా?, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం మారే సాంప్రదాయం కొనసాగుతుందా? అనే దానిపై ఇవాళ మధ్యాహత్నం వరకు తెలియనుంది. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు, ఆప్‌లు గెలుపుపై సంపూర్ణ ధీమాతో ఉన్నాయి.
Read More...
బ్రేకింగ్ న్యూస్.. ఎమ్మెల్యేల కొనుగోలు నిందితుల విడుదల.. వెంటనే మరో షాక్ ఇచ్చిన పోలీసులు