‘ఇండియా’ కన్వీనర్‌ ఆయనే.. రేపే ప్రకటన ?

దిశ, నేషనల్ బ్యూరో : ‘ఇండియా’ కూటమి నేతల కీలక భేటీ శనివారం (జనవరి 13న) ఉదయం 11:30 గంటలకు జరగనుంది.

Update: 2024-01-12 14:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘ఇండియా’ కూటమి నేతల కీలక భేటీ శనివారం (జనవరి 13న) ఉదయం 11:30 గంటలకు జరగనుంది. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో కూటమి కన్వీనర్ సహా వివిధ పోస్టుల ఎంపికపై చర్చించనున్నారు. ‘ఇండియా’ కన్వీనర్‌గా బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్‌ను నియమించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. కూటమి అధ్యక్ష పదవి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు దక్కొచ్చని అంటున్నారు. నితీష్‌ను కన్వీనర్‌గా చేసేందుకు విపక్ష కూటమిలోని చాలా పార్టీలు ఇప్పటికే అంగీకరించాయని, అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంకా ఒపీనియన్ చెప్పాల్సి ఉందని చెబుతున్నారు. కూటమిలోని పలు పార్టీల మధ్య సీట్ల పంపకాలు దాదాపు కొలిక్కి వచ్చిన ప్రస్తుత తరుణంలో జరుగుతున్న ఈ మీటింగ్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. శివసేన (ఉద్ధవ్‌), ఎన్‌సీపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల పంపకానికి సంబంధించి ఇప్పటివరకు ఇండియా కూటమి కమిటీ సమావేశాలను నిర్వహించింది. ఇంకా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తో ఎలాంటి చర్చలు జరగలేదు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు 3 సీట్లను టీఎంసీ ఆఫర్‌ చేసిందని తెలుస్తోంది. దీనికి ప్రతిగా అసోంలో రెండు సీట్లు, మేఘాలయలో ఒక సీటును తమకు కేటాయించాలని టీఎంసీ ప్రపోజ్ చేసిందని సమాచారం.

Tags:    

Similar News