కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఎగ్జిట్ పోల్స్‌ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ఆరోపించారు.

Update: 2024-06-01 03:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎగ్జిట్ పోల్స్‌ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడం ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ తిరస్కరణకు గురవుతోందని తెలిపారు. ‘కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని ఎన్నికల్లో ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు వాస్తవికతను గ్రహించింది. రేపు ఎన్నికల తర్వాత ప్రసారం చేయబోయే ఎగ్జిట్ పోల్స్‌లో ఓటమిని ఎదుర్కొంటుందని తెలుసు. ఎగ్జిట్ పోల్ అంచనాలపై మీడియా అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ వద్ద సమాధానం లేదు. అందుకే బహిష్కరిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

న్యాయపరమైన తీర్పులు, ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేనప్పుడు సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని తెలిపారు. బీజేపీ అనేక సర్వేలలో ఓడిపోయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్‌ను ఏనాడూ బహిష్కరించలేదని తెలిపారు. ఎన్డీయేకు 400 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చడానికి రెడీగా ఉన్నాయన్నారు. కాగా, టీవీ చానెళ్లలో జరిగే ఎగ్జిట్ పోల్ చర్చల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం ఏడో దశ ఎన్నికలు ముగిసిన అనంతరం వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. 


Similar News