'దేశంలో ‘షరియా’ అమలుకు కాంగ్రెస్ ప్లాన్'.. హిజాబ్ రద్దుపై కేంద్రమంత్రి ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇస్లామిక్ షరియా చట్టాలు అమలవుతాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే పక్కా ప్రణాళికతో హస్తం పార్టీ ఉందని ఆరోపించారు. కర్ణాటకలోని విద్యా సంస్థల్లో హిజాబ్‌పై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ కామెంట్స్ చేశారు.
కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తేసిన సిద్ధరామయ్య సర్కారు.. షరియా చట్టం అమల్లోకి తెచ్చే ప్లాన్‌లో ఉందని పేర్కొన్నారు. ఇదే అంశంపై మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప స్పందిస్తూ.. ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికే సిద్ధరామయ్య హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తేశారని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎవరూ డిమాండ్ కూడా చేయలేదన్నారు.