పేద విద్యార్థులకు ‘సూపర్ 30’ ఆనంద్ మరో కానుక !

సూపర్ 30 ఆనంద్ కుమార్ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. పేద విద్యార్థుల కోసం త్వరలో కొత్తగా ఆన్ లైన్ ప్లాట్ ఫాం ప్రారంభిస్తానన్నారు ఈ మ్యాథమెటీషియన్.

Update: 2024-04-14 18:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సూపర్ 30 ఆనంద్ కుమార్ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. పేద విద్యార్థుల కోసం త్వరలో కొత్తగా ఆన్ లైన్ ప్లాట్ ఫాం ప్రారంభిస్తానన్నారు ఈ మ్యాథమెటీషియన్. "రీఇమేజినింగ్ ఇండియా: షేపింగ్ ది గ్లోబల్ ఎకనామిక్ ల్యాండ్‌స్కేప్" అనే అంశంపై కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు ఆనంద్ కుమార్. అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకోవాల్సిన టైం ఆసన్నమైందన్నారు.

సూపర్ 30 పేదలు వారి జీవితాలను మార్చడానికి సహాయపడిందని అన్నారు. విద్యవల్లే మార్పు సాధ్యమైందన్నారు. పేద విద్యార్థుల కోసం కొత్తగా ఆన్ లైన్ ప్లాట్ పాం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వల్ల ఏర్పడిన అంతరాయం తనకు చాలా నేర్పించిందన్నారు. ఇంట్లోనే చిక్కుకుపోయిన విద్యార్థులతో సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయ్యానని.. కష్టాల నుంచి చాలా నేర్చుకోవచ్చని అన్నారు.

ప్రతి పేదవిద్యార్థి చదువుకునేలా చూడాలన్నదే తన కల అని అన్నారు. పేదరికం కారణంగా చాలా మంది పైకి రావట్లేదని.. వారికి న్యూటన్, రామానుజన్ గా మారగల సామర్థ్యం ఉందని అన్నారు. ఆన్ లైన్ ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందించడమే తన లక్ష్యమన్నారు.


Similar News