కోల్‌కతా డాక్టర్ మర్డర్ కేసులో కీలక మలుపు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-08-19 12:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు సోమవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణలో ఇప్పటికే పలు సాక్ష్యాలు సేకరించిన సీబీఐ నిందితుడు సంజయ్ ను పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్. ఈ టెస్ట్ చేయడం ద్వారా ఈ ఘటనలో నిందితుడు ఒక్కడే పాల్గొన్నాడా లేక ఇంకెవరైనా ఉన్నారా అనే విషయాలతో పాటు, ఈ దాడిలో ఎవరైనా ప్రోత్సహించారా అనే విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఆర్జీ కాలేజీలోని పలువురు డాక్టర్లను , సిబ్బందిని, మాజీ ప్రిన్సిపల్ ను పలుమార్లు సీబీఐ ప్రశ్నించింది. కాగా ఈ కేసులో ముందు నుండి రాష్ట్ర ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ తీవ్ర అలసత్వం ప్రదర్శించారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా భద్రతా కారణాల దృష్ట్యా మృతురాలి అంత్యక్రియలు పోలీసులు హడావిడిగా జరపడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందంటూ మృతిరలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. 


Similar News