కోల్‌కతా కేసు.. సీబీఐ కస్టడీకి మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్

కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచారం ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-09-03 14:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచారం ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆర్జీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను ప్రత్యేక కోర్టు 8 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. గతంలో వైద్యురాలి కేసులో కస్టడీకి ఇవ్వగా.. ఇపుడు మాత్రం మెడికల్ కాలేజీలో పాల్పడిన ఆర్థిక అవకతవకలపై కస్టడీ విధించింది. మెడికల్ కాలేజీలో అనాథ శవాలను అమ్ముకోవడం, ఆసుపత్రి టెండర్లలో అవినీతి వంటి అంశాలు సీబీఐ విచారణలో వెలుగులోకి రాగా.. వీటిపై మరింత లోతుగా ప్రశ్నించేందుకు కోర్టును సీబీఐ కస్టడీకి కోరింది. దీనిపై స్పందించిన కోర్ట్ 8 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైద్యురాలి హత్యాచార ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్ ఘోష్ ను.. కాలేజీలో జరుగుతున్న అవినీతిపై నిలదీసిన కారణంగా వైద్యురాలిపై ఈ దారుణానికి ఒడిగట్టారా అనే కోణంలో కూడా సీబీఐ ప్రశ్నించనుందని సమాచారం.    


Similar News