Coast guard: ఇండియన్ కోస్ట్ గార్డ్ చీఫ్‌గా పరమేష్.. ఈ నెల 15న బాధ్యతల స్వీకరణ

ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త చీఫ్‌గా ఎస్ పరమేష్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్వర్వులు జారీ చేసింది.

Update: 2024-10-14 13:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త చీఫ్‌గా ఎస్ పరమేష్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్వర్వులు జారీ చేసింది. మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం పరమేష్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం చీఫ్‌గా అవకాశం కల్పించింది. నేషనల్ డిఫెన్స్ కాలేజ్, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన పరమేష్ కోస్ట్ గార్డ్‌లో గత మూడు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పని చేశారు. వృత్తి పరంగానూ మంచి రికార్డు ఉంది. సముద్ర నావిగేషన్, డైరెక్షన్‌లో నైపుణ్యం కలిగి ఉన్నట్టు కేంద్రం ప్రకటనలో తెలిపింది. అంతేగాక అడ్వాన్స్‌డ్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ సమర్ వంటి ప్రధాన నౌకలకు నాయకత్వం వహించారు. ఆయన సేవలకు గాను 2012లో రాష్ట్రపతి తత్రక్షక్ పతకం అందుకున్నారు.


Similar News