BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో CM కేజ్రీవాల్ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ

Update: 2024-06-25 17:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు మంగళవారం రాత్రి జైల్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఆఫీసర్స్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం సీబీఐ కేజ్రీవాల్‌ను ట్రయల్ కోర్టులో హాజరు పర్చనున్నట్లు సమాచారం.

కాగా, ఇదే కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలపై కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జ్యూడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ అరెస్ట్ చేసిన కేసులో ఇటీవలే రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయగా.. ట్రయల్ కోర్టు తీర్పును ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించాలని ఈడీ కోరింది. ఈడీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ క్రమంలోనే ఇదే కేసులో సీబీఐ కేజ్రీవాల్‌ను చేయడం సంచనలంగా మారింది. 


Similar News