మాల్దీవుల సివిల్ సర్వెంట్లకు భారత్ లో శిక్షణ

మాల్దీవులకు చెందిన సివిల్ సర్వెంట్లకు రానున్న ఐదు సంవత్సరాలలో శిక్షణ ఇచ్చేందుకు భారత్ లో రంగం సిద్దమైంది.

Update: 2024-08-29 17:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : మాల్దీవులకు చెందిన సివిల్ సర్వెంట్లకు రానున్న ఐదు సంవత్సరాలలో శిక్షణ ఇచ్చేందుకు భారత్ లో రంగం సిద్దమైంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ ఇటీవలి మాల్దీవుల పర్యటనకు వెళ్ళినపుడు చేసుకున్న ఒప్పందంలో భాగంగా.. 2024 నుండి 2025 వరకు దశల్లో 1000 మంది సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందాలు జరిగాయి. అయితే తొలి విడతగా ఈ ఏడాదిలో 175 మందికి ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ కు, మాల్దీవుల సివిల్ సర్వీస్ కమిషన్ అధ్యక్షునికి మధ్య గురువారం ద్వైపాక్షిక సమావేశం జరిగింది.   


Similar News