ఆ పిల్లల‌కు కూడా పేరెంట్స్ ఆస్తిలో వాటా : Supreme Court

చట్టబద్ధంగా చెల్లుబాటు కాని పెళ్లిళ్లు చేసుకున్న వారి సంతానానికి కూడా త‌ల్లిదండ్రుల ఆస్తిలో వాటాను ఇవ్వాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Update: 2023-09-01 12:01 GMT

న్యూఢిల్లీ : చట్టబద్ధంగా చెల్లుబాటు కాని పెళ్లిళ్లు చేసుకున్న వారి సంతానానికి కూడా త‌ల్లిదండ్రుల ఆస్తిలో వాటాను ఇవ్వాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మిగతా సంతానంలాగే వారికీ ఆస్తిహక్కులు వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది. ఇలాంటి అంశంపై 2011లో దాఖ‌లైన ఓ పిటిష‌న్‌ (రేవన సిద్ధప్ప వర్సెస్ మల్లికార్జున్ కేసు)పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధ‌ర్మాస‌నం ఈ వ్యాఖ్యలు చేసింది.

హిందూ వార‌స‌త్వ చ‌ట్టం ప్రకారం .. గుర్తింపు లేని పెళ్లి చేసుకున్న వారికి క‌లిగే సంతానం కూడా త‌మ పేరెంట్స్ ప్రాప‌ర్టీపై హ‌క్కును పొందేందుకు అర్హులు అవుతారని పేర్కొంది. ఇదే కేసుపై 2011లో విచారణ నిర్వహించిన ఇద్దరు జ‌డ్జిల‌ ధ‌ర్మాస‌నం.. గుర్తింపులేని పెళ్లి చేసుకున్న వారి సంతానానికి ఆస్తి హ‌క్కులు వ‌ర్తించ‌వని అప్పట్లో తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కొత్త తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం వెలువ‌రించింది.


Similar News