Children killed: ఏనుగుల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి.. ఛత్తీస్‌గఢ్‌లో విషాద ఘటన

ఛత్తీస్ గఢ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏనుగు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-11-10 13:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌(Chathisgarh) లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏనుగు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సూరజ్ పూర్ జిల్లా(Surajpur districk)లోని ప్రేమ్ నగర్ (Premnagar) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చిట్ ఖాయ్ గ్రామానికి సమీపంలోని అడవి పక్కన గుడిసె వేసుకుని నివసిస్తున్న ఓ గిరిజన కుటుంబం నిద్రిస్తున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు వారిపై దాడి చేసింది. దీంతో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, భార్యాభర్తలు, మరో ముగ్గురు పిల్లలు సురక్షితంగా బయటపడ్డట్టు అటవీ అధికారి పంకజ్ కుమార్ (Pankaj kumar) తెలిపారు. మృతి చెందిన చిన్నారులను బిసు పండో(11), కాజల్ (5)గా గుర్తించారు. పిల్లలిద్దరూ గాఢ నిద్రలో ఉండటం వల్ల ఏనుగుల నుంచి తప్పించుకోలేక పోయారని వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఏనుగుల దాడితో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా, గత 25 రోజుల్లోనే ఛత్తీస్ గఢ్‌లో ఏనుగుల దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

Tags:    

Similar News