Elephant Attack: ఛత్తీస్ గఢ్ లో ఏనుగు దాడిలో నలుగురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ఏనుగు దాడిలో నలుగురు చనిపోయారు. బాగీచా నగర్ పంచాయతీ పరిధిలోని ఈ ఘటన జరిగింది.

Update: 2024-08-11 04:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో ఏనుగు దాడిలో నలుగురు చనిపోయారు. బాగీచా నగర్ పంచాయతీ పరిధిలోని శుక్రవారం ఈ విషాద ఘటన జరిగిందని జష్ పూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) జితేంద్ర ఉపాధ్యాయ తెలిపారు. రహదారి పక్కనున్న ఇంటిపై ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో తండ్రీకుమార్తెలు సహా మరో మరొకరు చనిపోయారని అధికారులు తెలిపారు. బాధితుల అరుపులు విని సాయం చేసేందుకు వచ్చిన పక్కింటి వ్యక్తి కూడా చనిపోయినట్లు వెల్లడించారు. అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలోకి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

ఏనుగు దాడులు

ఏప్రిల్‌లో తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడిలో ఇద్దరు చనిపోయారు. కౌటాల మండలం చింతల మానేపల్లిలో ఏప్రిల్‌ 3న పొలంలోకి వచ్చిన ఏనుగు ఒకరిని హతమార్చింది. ఏప్రిల్ 4న పెంచికల్ పేట్ మండలంలో మరో వ్యక్తి ఏనుగు దాడిలో చనిపోయాడు. అంతకుముందు ఏప్రిల్ 1న కేరళలోని పతినంతిట్ట జిల్లాలో ఏనుగు దాడిలో ఒకరు చనిపోయాడు.


Similar News