కునో నేషనల్ పార్క్‌లో చీతాల మరణాలపై దక్షిణాఫ్రికా అటవీ శాఖ కీలక ప్రకటన

మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో రెండు చీతాల మరణాలపై దక్షిణాఫ్రికా అటవీ, మత్స్య, పర్యావరణ శాఖ (డీఎఫ్ఎఫ్ఈ) స్పందించింది.

Update: 2023-04-28 16:54 GMT

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో రెండు చీతాల మరణాలపై దక్షిణాఫ్రికా అటవీ, మత్స్య, పర్యావరణ శాఖ (డీఎఫ్ఎఫ్ఈ) స్పందించింది. ఈ రెండు చీతాల మరణాలను తాము ముందే ఊహించామని పేర్కొంది. భారత్‌లో వాటి మనుగడ కష్టమే అని తెలిపింది. మరణించిన రెండు చీతాలలో ఒకటి నమీబియా నుంచి మరొకటి దక్షిణాఫ్రికా నుంచి తెచ్చినవి. చిరుత జనాభానా పెంచేందుకు మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌కు తెచ్చారు. మాంసాహార జంతువుల పునః ప్రవేశాలు కష్టతరమైనవని.. అంతర్గతంగా ప్రమాదకరమైనవని డీఎఫ్ఎఫ్ఈ ఒక ప్రకటనలో తెలిపింది.

జంతువులకు గాయాలు, మరణాల ప్రమాదాలు పెరుగుతాయని పేర్కొంది. పునః ప్రారంభ దశలో ఇవి జరుగుతాయని ప్రకటనలో చెప్పింది. ఈ చీతాల మరణానికి సంబంధించిన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు దక్షిణాఫ్రికా ప్రభుత్వం తెలిపింది. ‘చీతాల మరణానికి సంబంధించి శవ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇవి ఏదైనా అంటు వ్యాధితో చనిపోయాయా లేదా అనేది తేలాలి. అంటువ్యాధితో చనిపోతే ఇతర చిరుతలకు కూడా ప్రమాదం పొంచి వున్నట్టే’ అని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News