చంద్రయాన్ 4,5 డిజైన్లు సిద్దం : ఇస్రో ఛైర్మన్ సోమనాథ్

చంద్రుడిపై భారత్ చేస్తోన్న ప్రయోగాల్లో చంద్రయాన్ అతి ముఖ్యమైనది.

Update: 2024-08-20 17:02 GMT

దిశ,వెబ్ డెస్క్ : చంద్రుడిపై భారత్ చేస్తోన్న ప్రయోగాల్లో 'చంద్రయాన్' అతి ముఖ్యమైనది. చంద్రుడి మీది నుండి మట్టి, రాళ్ళు తీసుకు రావడమే చంద్రయాన్ లక్ష్యం. ఇందులో ఇప్పటికే చంద్రయాన్ మూడు ప్రయోగాలు పూర్తవగా, తదుపరి 4, 5 చంద్రయాన్ ప్రాజెక్టుల డిజైన్లను భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) సిద్దం చేసింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే వీటి తయారీ మొదలు పెడతామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథన్ తెలిపారు. అలాగే వచ్చే 5 సంవత్సరాల్లో 70 ఉపగ్రహ ప్రయోగాలకు ఇస్రో సిద్దంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక గగన్ యాన్ ప్రాజెక్టును ఈ ఏడాది చివర్లో చేపడతామని, ఇందుకు సంబంధించిన రాకెట్ పరికరాలన్నీ ఇప్పటికే శ్రీహరికోటకు చేరుకున్నాయని వెల్లడించారు. కాగా చంద్రయాన్-4 ప్రయోగం 2028 లో చేపట్టనున్నట్టు సమాచారం. 


Similar News