జాబిల్లికి అత్యంత చేరువగా చంద్రయాన్-3.. ఐదో కక్షలోకి ఎంట్రీ..
జూలై 14న విజయవంతంగా ఆకాశంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 నిర్ధేశించిన టార్గెట్లను రీచ్ అవుతూ విజయవంతంగా కొనసాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: జూలై 14న విజయవంతంగా ఆకాశంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 నిర్ధేశించిన టార్గెట్లను రీచ్ అవుతూ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం చంద్రుని చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ అంతరిక్ష నౌక.. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు చివరి కక్షలోకి చేరుకుంది. దీంతో చంద్రయాన్-3 చంద్రునికి అత్యంత చేరువలోకి చేరుకుంది. ప్రస్తుతం ఇది.. 153 కి.మీ x 163 కి.మీ కక్ష్యలోకి వచ్చేసింది. అలాగే ఈ నెల 23న చంద్రుడిపై దక్షిణ ధ్రువ ప్రాంతంలో లాండింగ్ కానుంది. అయితే చంద్రయాన్ 3 లాండింగ్ కాకముందే తన పనిని కానిచ్చేస్తుంది. ప్రస్తుతం చంద్రునికి చేరువలో ఉండటంతో ఆ గ్రహంపై ఉన్న వాతావరణానికి సంబంధించిన హై రెజల్యూషన్ ఫొటోలు తీస్తూ ISRO కార్యాలయానికి చేరవేస్తుంది.