సీజీపీఎస్సీ రిక్రూట్ మెంట్ స్కామ్..ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(సీజీపీఎస్సీ)లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఆ సంస్థ మాజీ చైర్మన్‌తో పాటు ఇతరులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

Update: 2024-07-15 18:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(సీజీపీఎస్సీ)లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఆ సంస్థ మాజీ చైర్మన్‌తో పాటు ఇతరులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2022లో జరిగిన ఓ పరీక్షలలో అనర్హులకు రిక్రూట్ మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించారని ఆరోపణలున్నాయి. ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యుల పేర్లు మెరిట్ లిస్టులో ఉండటంతో ఇందులో అవినీతి జరిగిందని పలువురు ఆరోపించారు. దీంతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సూచన మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే రాయ్‌పూర్‌, భిలాయ్‌లోని సోనావానీ, ధ్రువ్‌ తదితరుల నివాస ప్రాంగణాల్లో సోమవారం సోదాలు నిర్వహించింది. ప్రముఖ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు ఈ రిక్రూట్‌మెంట్‌లో ప్రధాన లబ్ధిదారులని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన ప్రగ్యా నాయక్‌, కాంగ్రెస్ నేతల సన్నిహితుల బంధువులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫీసర్‌గా ఎంపికైన ప్రఖర్ నాయక్ తదితరులు ఈ స్కామ్‌తో లబ్ది పొందినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News