సరోగసీ నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం

కొత్త నిబంధనల్లో వీర్యం, అండం రెండూ కూడా దాతల నుంచి పొందేలా కేంద్రం నిబంధనలు మార్చింది.

Update: 2024-02-23 17:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పిల్లలు కనలేని తల్లిదండ్రులకు వరంగా ఉన్న సరోగసీ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. భాగస్వామిలో ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే వారు దాతల వీర్యం ఉపయోగించుకునేలా సరోగసీ నియమాల్లో సవరణలు చేసింది. గతంలో లోపాలు ఉన్న వారు మాత్రమే సరోగసీ ఉపయోగించుకునేందుకు అర్హత ఉండేది. వీర్యం, అండాలు కూడా దగ్గర బంధువులవై అయి ఉండాలి. పైగా భార్య లేదా భర్త ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని జిల్లా మెడికల్ బోర్డ్ ధ్రువీకరిస్తే, వారు సరోగసీ కోసం దాత అండాన్ని పొందే వీలుండేది. అయితే, కొత్త నిబంధనల్లో వీర్యం, అండం రెండూ కూడా దాతల నుంచి పొందేలా కేంద్రం నిబంధనలు మార్చింది. వైద్య కారణాల వల్ల గర్భం దాల్చలేని వ్యక్తులు, ఇతర సంతానోత్పత్తి ఆప్షన్లు లేని వృద్ధ మహిళలు దాత అండాల నుంచి ప్రయోజనం పొందవచ్చు. అలాగే స్పెర్మ్ డొనేషన్ కూడా పొందవచ్చని నిబంధనలు పేర్కొన్నాయి. తాజా నిబంధనల్లో సరోగసి పొందాలని భావించే వితంతువులు లేదా విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలకు వర్తించవని కేంద్రం పేర్కొంది. సరోగసీ చేయించుకునే ఒంటరి మహిళలు తప్పనిసరిగా వారి సొంత అండాలు, దాత స్పెర్మ్‌ను ఉపయోగించాలని పేర్కొంది. అయితే, ఒంటరి, వితంతు మహిళలకు ఈ మినహాయింపుపై ఆందోళనలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News