జమిలికి గ్రీన్ సిగ్నల్.. ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్

కేంద్ర క్యాబినెట్ వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ నిర్వహణపై రామ్‌‌నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికకు నేడు (బుధవారం) ఆమోదం తెలిపింది.

Update: 2024-09-18 09:27 GMT

దిశ, వెబ్ డెస్క్: జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. బుధవారం ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర క్యాబినెట్.. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ నిర్వహణపై రామ్‌‌నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికకు నేడు (బుధవారం) ఆమోదం తెలిపింది. కాగా.. రాబోయే శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా.. గత నెల జరిగిన స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకల సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ సమాయాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రభుత్వ పథకాల అమలుకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అందువల్ల ఒకే దేశం, ఒకే ఎన్నికలు నిర్వహించడంపై తాము అధ్యయనం చేస్తున్నామని అన్నారు. ఈ క్రమంలోనే రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటిని ఏర్పాటు చేసి జమిలి ఎన్నికలపై రిపోర్ట్ తయారు చేయాలని కోరారు. తాజాగా రామ్‌నాథ్ కోవింద్ రిపోర్టు పూర్తి చేయగా.. నేడు ఆ రిపోర్టుపై కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.


Similar News